InterviewSolution
| 1. |
ఏదైనా సాధించాలంటే పట్టుదల, దృఢ సంకల్పం అవసరం. |
|
Answer» జ. జీవితంలో ఏదైనా సాధించాలన్నా ,ఏదైనా ఒక పని చేయాలన్నా ,అందుకు తగిన సమర్థత అవసరం.అయితే సమర్థత ఉన్నంత మాత్రాన అన్ని పనులు చేయలేం,అన్నింటిని సాధించలేం.సమర్ధతకు తగిన సాధన,నిరంతర శ్రమ తోడైనప్పుడు ఆశించిన గమ్యాన్ని సులభంగా చేరుకోవచ్చు.ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క విధమయిన సమర్థత నిక్షిపాతం అయి ఉంటుంది.ఒక వ్యక్తి బాగా పాడగలుగుతాడు.ఇంకొక వ్యక్తిలో మంచి కవిత్వం రాయగల శక్తి ఉంటుంది.మంచి వ్యక్తిత్వం ఉంటుంది.మరొక వ్యక్తిలో చిత్రలేఖన నైపుణ్యం దాగి ఉంటుంది.వారి వారి శక్తిసామర్ధ్యాలను గుర్తించి పట్టుదలతో కృషి చేస్తే ఆయా రంగాలలో పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించుకోగలుగుతారు. |
|