1.

Essay on prevention of vathavarana khalushyam nirvana in telugu

Answer»

\huge\boxed{\fcolorbox{white}{pink}{Answer}}

POLLUTION అనే పదం లాటిన్ భాషలోని pollutonium అనే పదం నుంచి వచ్చింది. లాటిన్ భాషలో pollutonium అంటే అపరిశుభ్రత అని అర్థం.

మానవుడి కార్యకలాపాల వల్ల పర్యావరణంలో కొన్ని పదార్థాల గాఢతలు సాధారణ స్థాయిని మించిపోయి పర్యావరణంపైదుష్ర్పభావం చూపుతాయి. ఫలితంగా మానవుడితో సహా ఇతర జీవరాశులపై చెడు ప్రభావం ఉంటుంది. దీన్నే పర్యావరణ కాలుష్యం అంటారు. దీనికి కారణమయ్యే పదార్థాలను కాలుష్యకాలు అంటారు.

ఉదా: లెడ్, పాదరసం, కార్బన్‌మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ మొదలైనవి.

ప్రకృతిలో సహజ ప్రక్రియ వల్ల జరిగే కాలుష్యాన్ని సహజ కాలుష్యం అని, మానవుడి చర్యల వల్ల జరిగే కాలుష్యాన్ని కృత్రిమ కాలుష్యం అని అంటారు.

కాలుష్యకాల వర్గీకరణ

కాలుష్యకాలు పర్యావరణంలోకి ప్రవేశించే, కలుషితం చేసే దశల్లోని స్థితిని బట్టి రెండు రకాలుగా వర్గీకరిస్తారు. అవి..

ఎ) ప్రాథమిక కాలుష్యకాలు (Primary POLLUTANTS: ఈ కాలుష్యకాలు పర్యావరణంలోకి ఏ స్థితిలో ప్రవేశిస్తాయో అదే స్థితిలో పర్యావరణాన్ని కలుషితం చేస్తాయి.

ఉదా: డీడీటీ, పాదరసం, సల్ఫర్‌డయాక్సైడ్ మొదలైనవి.

బి) ద్వితీయ కాలుష్యకాలు (SECONDARY Pollutants: ప్రాథమిక కాలుష్యకాల మధ్య జరిగే చర్యల వల్ల ఇవి ఏర్పడతాయి. ఉదా: ప్రధాన కాలుష్యకాలైన నైట్రోజన్ ఆక్సైడ్‌లు, హైడ్రోకార్బన్‌లు కాంతి సమక్షంలో చర్య జరిపి ద్వితీయ కాలుష్యకాలైన పెరాక్సీ ఎసైల్ నైట్రేట్ (PAN) లను ఏర్పరుస్తాయి.

పరిమాణాత్మక కాలుష్యకాలు (Quantitative Pollutants): పర్యావరణంలో కొన్ని పదార్థాల గాఢతలు ఆరంభ అవధి విలువను దాటినప్పుడు మాత్రమే అవి కాలుష్యకాలుగా మారతాయి. వీటినే ప్రకృతిపరమైన కాలుష్యకాలు అని కూడా అంటారు.

I hope it will helps u...

plz mark as BRAIN list ...☺️☺️☺️



Discussion

No Comment Found