InterviewSolution
| 1. |
Information about guava tree in Telugu. please give the answer in Telugu |
|
Answer» జామ మొక్కలు మిర్టిల్ కుటుంబానికి చెందిన సిడియం కోవకు చెందిన మొక్కలు. శీతోష్ణస్థితి బట్టి 100 వేర్వేరు రకాలుగా లభ్యమవుతున్నాయి. ఇవి మెక్సికో, మధ్య, దక్షిణ అమెరికాలకు జాతీయ మైనవి. జామపండు, 4 సెం.మీ నుండి 12 సెం.మీ పొడవు ఉండి చూడడానికి ఏపిల్ పండులాగాని, బేరి పండులాగ గాని ఉంటుంది. లోపలి కండ తెలుపు, ఎరుపు లేదా గులాబీవర్ణం కలిగి తియ్యగా ఉండి కమ్మని వాసనతో దృఢమైన పచ్చని పై తొడుగు కలిగి ఉంటుంది. స్ట్రా బెర్రీ జామ (పి. కాటిల్ యానమ్) బ్రెజిల్ దేశంలో పుట్టి, ఎర్రని పళ్లు కలిగి ఉంటుంది. ఈ పళ్లు పై పొర గరకుగా లోపలి గుజ్జు ఎర్రగా, రుచికి స్ట్రాబెర్రీ లాగ ఉంటాయి. ఈ పండు ఒక విలక్షణమైన సువాసనతో నిమ్మకంటే కొంచెం తక్కువ ఘాటుగా కలిగి ఉంటుంది. జామపండు లోపలి గుజ్జు తియ్యగా లేక పుల్లగా ఉండి తెలుపు నుంచి ముదురు గులాబీ వర్ణం కలిగి ఉంటుంది. లోపలి గింజలు గట్టిగా ఉండి, పండుకూ పండుకు వాటి సంఖ్య మారుతూ ఉంటుంది |
|