1.

'ఇంటి గెలిచి రచ్చ గెలవమన్నారు మన పెద్దలు'. ఈ సామెత ఆదరంతో ఒక చక్కని వ్యాసము రాయండి. [ సామెత ఆధారిత వ్యాసము] ...ッ

Answer»

గెలిచి, రచ్చ గెలవమన్నారు’ ★ㅤㅤㅤㅤ______________ㅤㅤㅤఇంట గెలిచి‚ రచ్చ గెలవమన్నారు మన పూర్వీకులు. ఇంట గెలవడం అంటే మనని మనం గెలవటం. మన బలహీనతలను అర్ధం చేసుకుని‚ వాటిని అధిగమించడం. రచ్చ గెలవడం అంటే సమాజాన్ని గెలవటం. సమాజంలోని ఎటువంటి చెడునైనా అంతమందించే శక్తిని సొంతం చేసుకోవటం.ㅤㅤమనం సమాజంలో ఏ మార్పుకైనా స్వాగతం పలకాలంటే‚ ముందుగా దాన్ని మన ఆవాసంలో స్వాగతించాలి. ఈ సమాజం కాంక్షించే ఎంత పెద్ద మార్పు అయినా‚ ఒక ఇంట్లోనే పురుడు పోసుకోవాలి. మన ఇంట్లో విషయాలను వదిలేసి‚ సమాజం లోని విషయాల పైన దృష్టి పెడితే మనకు వచ్చేది విలువలేని ఫలితాలు మాత్రమే. కానీ మన నిలయంలో దానికి ఒక గట్టి పునాది వేసి ప్రారంభిస్తే‚ అది వెయ్యి రెట్లు ఫలితాన్నిస్తుంది. ముందు మనల్ని మనం తెల్సుకోవాలి. ఆ తర్వాతేగా పక్క వాడిని కూడా అర్థం చేసుకోగలం. ఉదాహరణకు‚ ఒక రాజకీయవేత్త తన ప్రజల నుండి మెప్పు పొందడం కంటే ముందు‚ అదే రాజకీయ వర్గంలోని ఇతర రాజకీయవేత్తల మెప్పు పొందాలి. అప్పుడే‚ సమాజంలో మంచి గౌరవాన్ని సంతరించుకుని‚ తన దేశ ప్రజల మనసులో ఇంకా ఉత్తమమైన స్థానాన్ని పొందుతాడు. అలాగే‚ నేటి తరం పిల్లలు రేపటి పౌరులు అని అంటారు. అలాంటి పౌరులకి కూడా శిక్షణ ఒక ఇంటి నుండే ప్రారంభమవుతుంది కదా! ఎందుకంటే కే పిల్లవాడికైనా తన తల్లిదండ్రులే మొదటి గురువులు. విద్యార్థులకు కి వాళ్ళ ఇంట్లో అమ్మానాన్నలు‚ పాఠశాలలో ఉపాధ్యాయులు ఇచ్చే గొప్ప నైతిక విలువల వల్లేగా ఈ సమాజం పట్ల ఒక బాధ్యతాయుత ప్రవర్తన ఏర్పడుతుంది. ㅤㅤㅤㅤమన పూర్వీకులు మనకు బోధించినది ఎప్పుడూ మనకి ఎంతో అవసరమైనవే. వాటిని అందుకే ఎప్పుడు పెడచెవిన పెట్టకూడదు అని అంటారు. ఏ పురోగతికైనా మన ఇల్లే కారణం. ఈ సమాజంలో ఎంత పెద్ద అభివృద్ధి కోసమైనా‚ ముందు మన ఇంట్లో అభివృద్ధి చేయడానికి బాధ్యతలను స్వీకరించాలి. అందుకే ‘ఇంట గెలిచి‚ రచ్చ గెలవమన్నారు’ మన పెద్దలు.



Discussion

No Comment Found