1.

Mathru basha lo vidhya bodhana in telugu

Answer»

ల్‌ యాజమాన్యంలో ఉన్న అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలలో ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశ పెట్టాలని నిర్ధేశిస్తూ మున్సిపల్‌ పరిపాలన, అభివృద్ధి మంత్రిత్వశాఖ జనవరి 2న 14 జీవో ను విడుదలచేసింది. దీని ప్రకారం మున్సిపల్‌ పరిధిలోని అన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నట్లు పేర్కొన్నారు. ఆంగ్లం నేర్చుకోవడం ముఖ్యమైతే ఆంగ్లం నేర్పాలి, ఆంగ్ల మాధ్యమాన్ని ఎందుకు ప్రవేశపెట్టడం? పాఠశాల సరిగా లేకపోతే ఆంగ్ల మాధ్యమం లో చదువుకున్నా ఆంగ్లం రాదని మాత్రం ఘంటాపథంగా చెప్పొచ్చు. 2011లో ఆంగ్లాన్ని ఒక బోధనా విషయంగా, ద్వితీయ భాషగా ఒకటవ తరగతి నుంచే ప్రవేశపెట్టారు. అయితే అందుకు శిక్షణపొందిన ఉపాధ్యాయుణ్ణి మాత్రం నియమించలేదు. అలాంటి వారు ఇప్పుడు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం విచిత్రంగా ఉంది. తెలియని భాషలో తెలియని విషయాలను బోధించే పద్ధతి అశాస్త్రీయమైనదే కాదు, ఇది విద్యార్థిపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తుంది. విద్యార్థిలో సహజంగా ఉండే ఉత్సుకతను, సృజనాత్మకతను తుంచివేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా విద్యావేత్తలు ఏ విజ్ఞాన శాస్త్రం నేర్చుకోవడానికైనా, పరాయిభాష నేర్చుకోవడానికైనా మాతృభాషా మాధ్యమమే సరైనదని చెబుతున్నారు. ప్రాథమిక స్థాయిలో మాతృభాషా మాధ్యమం అనివార్యమైన అవసరమని భారత రాజ్యాంగం (అధికరణం 350 ఎ), కొఠారీ కమిషన్‌ చెప్పింది. యునెస్కోనే కాదు అభివృద్ధిచెందిన దేశాల చరిత్ర, వర్తమానం అదే చెబుతున్నాయి. వస్తూత్పత్తిలో అత్యధికాభివృద్ధిని సాధించిన జపాన్‌ అత్యున్నత స్థాయి వరకు మాతృభాషా మాధ్యమాన్నే అమలుచేస్తోంది. 2010లో భారత ప్రభుత్వం తెచ్చిన విద్యాహక్కు చట్టం విభాగం 29(2)లో ఎలిమెంటరీ స్థాయిలో వీలైనంతవరకు మాతృభాషా మాధ్యమాన్నే అమలు చేయాలని నిర్ధేశించింది. అయితే ప్రస్తుత ప్రభుత్వం తాను పట్టిన కుందేటికి మూడేకాళ్ళు అన్నట్లు ప్రవర్తిస్తోంది. పరాయిభాషలో విద్య గరపడం జాతికి విద్యావంతులను దూరంచేయడమే. విద్యార్థి కూడా పరాయీకరణకు గురై మానసికంగా బలహీనుడవుతాడు. నేటి విద్యావంతులలో ఉన్న గొర్రెదాటు లక్షణానికి అదే కారణం. పాలకవర్గాలు కోరుకుంటున్నదిదే.



Discussion

No Comment Found