InterviewSolution
| 1. |
మొక్కలు నాటడం సంరక్షించడం అనే అంశం ఆధారంగా వ్యాసం రాయండి |
|
Answer» Answer: మానవునికి దేవుడు అనేక వరాలు ప్రసాదించాడు. అన్నిటిలో బుద్ధి బలం ప్రధానమైనది. ఆయన ప్రసాదించిన బుద్ధి, జ్ఞానాలు, శక్తి సామర్థ్యాల వల్లనే మానవుడు ప్రకృతిని తనకు అనుకూలంగా మలుచుకోగలుగుతున్నాడు. సృష్టి ప్రారంభం నుంచి ఈనాటి వరకూ ప్రకృతితో మానవుడు సహజీవనం సాగిస్తున్నాడు ప్రకృతిలో మొక్కలు, అడవులు దైవం ప్రసాదించిన అమూల్యమైన వరాలు. ఇవి కేవలం జీవితావసరాలకే కాకుండా అత్యున్నత విలువలను కూడా ప్రతిబిం బిస్తాయి. దేవుని అత్యద్భుత సృష్టిలో వృక్షాలకు అత్యున్నత స్థానం ఉంది.దేవుని పోషణ గుణానికి, ఉపాధి కల్పనా లక్షణానికి వృక్షాలు చక్కని తార్కాణాలు. పవిత్ర ఖురాన్‌లో వాటి గురించి ఇలా ఉంది… ఆయన ఆకాశం నుంచి వర్షం కురిపించి రకరకాల మొక్కలు మొలకెత్తిస్తున్నాడు. పచ్చని పొలాలు, వృక్ష సంపదను పైకి తెస్తున్నాడు. వాటి ద్వారా ధాన్యాన్ని, ఫల పుష్పాలను అందిస్తున్నాడు. ఈ మొక్కలు, వృక్షాలు పుష్పించి, ఫలించే తీరును పరికించి చూస్తే విశ్వసించే వారికి అందులో అనేక మంచి సూచనలున్నాయి’. plzz FOLLOW me and mark me as BRAINLIEST plzzzzzzzz |
|