InterviewSolution
| 1. |
పేదలకు దానం చేయటంవల్ల మనం పొందే మేలును గురించి తెలియజేస్తూ మిత్రునికి లేఖరాయండి. |
|
Answer» దానం చేయడం వలన మనం పొందే మేలును గురించి తెలియజేస్తు మిత్రునికి లేఖ: విశాఖపట్నం, 2-2-21.ప్రియమైన మిత్రునికి,నేను క్షేమం నువ్వు బావున్నావని బాగా చదువుతున్నావని అనుకుంటున్నాను . పరీక్షలు బాగా రాశావని తలుస్తాను. నేను పరీక్షలు చాలా బాగా రాసాను. నేను సంక్రాంతి సెలవుల్లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లాను. అక్కడ నేను ఎన్నో బట్టలు , పుస్తకాలూ పేదలకు దానం చేసాను. పేదలకు దానం చేయటం వాళ్ళ మనకి ఎంతో మేలు జరుగుతుంది. మనం పేదలకు తినడానికి తిండి , కట్టుకోవడానికి బట్టలు మరియు చదువొకోవడానికి పుస్తకాలూ దానం చేయాలి. మనం లేనివాళ్లకు ఇస్తే మనకు లేనప్పుడు వేరొకరు ఇస్తారు. దానం వాళ్ళ మనసుకు ఎంతో ఆనందం మరియు ప్రశాంతత కలుగుతుంది. నువ్వు కూడా నీకు వీలైనప్పుడు ఎంతోకొంత పేదలకు దానం చేస్తావని తలుస్తాను.ఇట్లు నీ స్నేహితుడు,దీపక్. |
|