InterviewSolution
| 1. |
-'రాజు రివాజులు బూజు పట్టగన్' అంటే ఏమిటి? |
|
Answer» 'రాజు రివాజులు బూజు పట్టగన్' అనే ఈ పంక్తి దాశరధి కృష్ణమాచార్యులు రచించిన రుద్రవీణ లోనిది. పంక్తి యొక్క అర్థం : 'రాజు రివాజులు బూజు పట్టగన్' అనగా 'ఉద్రిక్తలు కల్గించిన నవాబుల ఆజ్ఞలను పాటించే కాలం చెల్లిపోయింది' అని అర్థం. పద్యం : నాలుగు వైపులన్ జలధి నాల్కలు సాచుచు కూరుచుండె! క ల్లోలము రేపినారు భువిలో! నలుదిక్కుల గండికొట్టి సం ద్రాలకు దారినిచ్చిరి! ధరాతలమెల్ల స్వతంత్ర వారి ధా రాలులితమ్ము కాదొడగె, రాజు రివాజులు బూజు పట్టగన్! తాత్పర్యం : తెలంగాణా స్వాతంత్య్ర పోరాటం సముద్రం మాదిరిగా ఉప్పొంగుతున్నది. నాల్గువైపుల నుండి సముద్రానికి గండికొట్టి తెలంగాణ నేలనంతా స్వాతంత్య్రపు నీటితో తడుపుతున్నారు. ఉద్రిక్తలు కల్గించిన నవాబుల ఆజ్ఞలను పాటించే కాలం చెల్లిపోయింది.
మీకు అర్థమైందని అనుకుంటున్నాను. కానిచో కామెంట్లో తెలియచేయండి. కృతఙ్ఞతలు. |
|