| 1. |
Telugu essay on save girls educate girls |
|
Answer» ANSWER: న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీ బేటీ బచావో బేటీ పఢావో పథకంలో భాగంగా సుకన్యా సమృద్ధి యోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. హర్యానాలోని పానిపట్‌లో ఆయన ఐదుగురు బాలికలకు పాస్ బుక్‌లు పంపిణీ చేసి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ లింగ వివక్ష నిర్మూలనే లక్ష్యంగా ఈ పథకం ప్రవేశపెట్టామని అన్నారు. ఆడపిల్లల రక్షణలో సమాజం పాత్ర ఎంతో ఉందని చెప్పారు. గతంలో ఎం జరిగిందన్న విషయాన్ని మరిచి లక్ష్య సాధనపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. అమ్మాయిలు చదువుకుంటేనే సమాజంలో ఉన్నతంగా జీవిస్తారని అన్నారు. చదువు లేకపోతే పిల్లలు సమస్యల పరిష్కారంలో విఫలమవుతారని ఆడపిల్లల తల్లిదండ్రులు గుర్తించాలని అన్నారు. పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మేనకా గాంధీ మాట్లాడుతూ ఆడిబడ్డకు గౌరవం, రక్షణ ప్రధాన లక్ష్యాలుగా, లింగ వివక్ష నిర్మూలన దిశగా చైతన్యం తీసుకురావడమే ధ్యేయంగా ఈ పథకం ప్రారంభిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ తదితరులు పాల్గొన్నారు. తల్లికి అనారోగ్యంగా ఉన్నా, మాధురి ఈ కార్యక్రమానిక హాజరవడం ప్రధాని మోడీని ఆకట్టుకుంది. దీంతో ఆమెను ప్రశంసిస్తూ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. "మాధురి గారు కూడా మాతో ఉన్నారు. తల్లికి అనారోగ్యంగా ఉన్నా పానిపట్ వచ్చారు. స్త్రీ శిశువలను కాపాడాలంటూ మంచి సందేశాన్నిచ్చారు" అని పేర్కొన్నారు. Read more at: HTTPS://telugu.oneindia.com/news/india/narendra-modi-launch-beti-bachao-beti-padhao/articlecontent-pf78707-149886.html please MARK as the BRAINLIEST if it HELPS |
|